ప్రముఖ నటుడు రావి కొండలరావు మృతి..!

ప్రముఖ సినీ నటుడు రావి కొండలరావు (88) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.

నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాతగా కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.1958లో శోభ అనే చిత్రంతో కొండలరావు సినీ ప్రస్ధానం మొదలైంది.600కు పైగా సినిమాల్లో రావి కొండలరావు నటించారు.తేనే మనసులు, దసరా బుల్లోడు, ఎదురిటి మొగుడు పక్కింటి పెళ్లాం, రంగూన్ రౌడీ, భైరవ ద్వీపం, మీ శ్రేయోభిలాషి, ఓయ్, వరుడు, తదితర సినిమాల్లో నటించారు.

కొండలరావు భార్య రాధా కుమార కూడా పలు చిత్రాల్లో నటించారు.వీరిద్దరూ జంటగా చాలా చిత్రాల్లో కనిపించారు.కాగా రావి కొండలరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Telugu Actor, Ravi Kondalarao, Hyderabad, Kondalarao Died-ప్రముఖ న
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు