తెలంగాణ రెండో అసెంబ్లీ రద్దు అయింది.ఈ మేరకు కేసీఆర్ గవర్నమెంట్ ను రద్దు చేస్తూ రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు కూడా రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.కాగా తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే.
ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై క్లారిటీ రాగానే రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు అయింది.మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.