తెలంగాణ వాసులకి తీపికబురు .. కొత్తగా ఎన్ని కేసులంటే ?

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి.అయితే, ఈ రోజు మాత్రం కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి.

 Corona, Covid 19 , Telanagana Corona Update , Ts Corona Update , Ts Covid 19 Upd-TeluguStop.com

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.రాష్ట్రంలో తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 1,021 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అలాగే , ఈ సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,214 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084 కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 1,87,342 మంది డిశ్చార్జ్ అయ్యారు.మృతుల సంఖ్య మొత్తం 1,228 కు చేరింది.

ప్రస్తుతం 24,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.జీహెచ్ ‌ఎంసీ పరిధిలో కొత్తగా 228, రంగారెడ్డి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణలో జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలను చూస్తే … గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 228, ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 30, జగిత్యాల్‌ 31, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 7, కరీంనగర్‌ 67, ఖమ్మం 24, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 0, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 29, మంచిర్యాల 21, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 84, ములుగు 9, నాగర్‌ కర్నూల్‌ 23, నల్గొండ 46, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 6, నిజామాబాద్‌ 26, పెద్దంపల్లి 23, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 68, సంగారెడ్డి 44, సిద్ధిపేట్‌ 41, సూర్యాపేట 22, వికారాబాద్‌ 9, వనపర్తి 24, వరంగల్‌ రూరల్‌ 16, వరంగల్‌ అర్బన్‌ 27, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube