రేవంత్ ప్లేస్ లో డీకే.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి ?

ప్రస్తుతం టి కాంగ్రెస్( Telangana Congress ) లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తెలంగాణలో విజయం సాధించేందుకు ఆ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.

ఇటీవల కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తెలంగాణలో కూడా విజయం కోసం పక్కా వ్యూహరచనతోనే ముందుకు సాగుతోంది హస్తం పార్టీ.అందుకోసం కర్నాటకలో కాంగ్రెస్ విజయనికి బాటలు వేసిన డీకే శివకుమార్ ను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తోంది.

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ ( DK Shivakumar )పార్టీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.

ఊహించని స్థాయిలో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చి.తాను చెప్పినట్లుగా 135 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టాడు.దీంతో డీకే పనితీరుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కర్నాటక అధిష్టానం తెలంగాణ బాద్యతలను కూడా డీకే భుజలపైనే మోపనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పార్టీకి సంబంధించిన వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక, చేరికల వ్యవహారాలు.ఇలా కీలక అంశాలన్నిటికిని డీకే ఆద్వర్యంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల టి కాంగ్రెస్ నేతలు వరుసగా డీకేతో భేటీ అవుతుండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

అయితే పక్కా రాష్ట్రనికి చెందిన డీకే కు తెలంగాణలో ఎందుకు ప్రదాన్యత ఇస్తోంది అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.టి కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వంపై మొదటి నుంచి విభేదిస్తున్న వారి సంఖ్య గట్టిగానే ఉంది.సీనియర్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై అడపా దడపా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

దీంతో ఔనన్నా కాదన్నా పార్టీలో ఈ రేవంత్ మరియు సీనియర్స్ మద్య విబేదలు ఉన్నాయనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం.దీంతో ఎన్నికల సమయానికి రేవంత్ నాయకత్వంపై నేతలు పెదవి విరిస్తే తెలంగాణలో పట్టు కోల్పోయే అవకాశం ఉంది.

అందుకే ముఖ్యమైన అంశాలకు సంబంధించి రేవంత్ స్థానంలో డీకే కు బాధ్యత అప్పగిస్తే అన్నీ విధాలుగా సెట్ అవుతుందని అధిష్టానం భావిస్తోందట.మరి కర్నాటక కు విజయాన్ని అందించిన డీకే తెలంగాణ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేస్తారో చూడాలి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు