ఫాంహౌజ్ కాదు .. ఫార్మ్ లోకి వచ్చిన కేసీఆర్ ! 

ఫాం హౌజ్ ముఖ్యమంత్రిగా చాలా కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కెసిఆర్ ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఎక్కువగా ఆ ఫాం హౌజ్ కే పరిమితం అయిపోతూ వస్తున్నారు.

అన్ని వ్యవహారాలు అక్కడి నుంచే చక్కబెడుతూ వస్తున్నారు తప్ప, జనాల్లో తిరిగెందుకు, జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టేందుకు కానీ ఏ మాత్రం ఆసక్తి చూపించేవారు కాదు.

ఈ విషయంలో ఆయన ప్రతిపక్షాల నుంచే కాకుండా,  ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.ఫాం హౌజ్ ముఖ్యమంత్రిగా ముద్ర వేయించుకున్నారు .అయితే ఇప్పుడు మాత్రం ఆ ముద్ర నుంచి బయటపడేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.ఇటీవలే మంత్రివర్గం నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో,  ఆ శాఖలన్నిటిని ఇప్పుడు కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు.

Telangana Cm Kcr Is More Politically Active, Kcr, Trs, Telangana, Etela Rajender

 అధికారులతో ప్రస్తుతం కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ పోలీసులకు సైతం ఆదేశాలు ఇచ్చారు.అలాగే గాంధీ ఆసుపత్రిని కెసిఆర్ సందర్శించారు.

ఈ సందర్భంగా పిపిఈ కిట్లు, చేతికి గ్లౌజులు మాస్కులు లేకుండా కరోనా పేషంట్ ల ను కేసీఆర్ పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే వరంగల్ లోనూ  పర్యటనలు చేశారు.

Advertisement

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి అక్కడి రోగులను పరామర్శించారు.ఇలా చెప్పుకుంటూ వెళితే కెసిఆర్ తనదైన ముద్ర మళ్లీ కనిపించే విధంగా చేసుకుంటున్నారు.

ఫాం హౌజ్ ముఖ్యమంత్రి ని కాదని, తాను ఫామ్ లోకి వచ్చేసాను అని కెసిఆర్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అసలు చాలాకాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా  వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఇంతగా జనాల బాట పట్టడానికిిి కారణం టిఆర్ఎస్ కు ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.

అలాగేేే నిరుద్యోగ సమస్య విషయంలో టీఆర్ఎస్ ఇబ్బంది పడుతున్న తరుణంలో టి ఎస్ పి ఎస్ సి కిి కొత్త కమిటీని ప్రకటించారు .తెలంగాణలో పెండింగ్ లో ఉన్న  అన్ని సమస్యలను పరిష్కరించే  దిశగా కేసీఆర్ అడుగులుు వేస్తున్నారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను కరోనా సమయంలో అకస్మాత్తుగా తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో,  స్వయంగా ఈ శాఖలను పర్యవేక్షిస్తున్న కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.

నిత్యం జనాల్లో తిరుగుతూ టిఆర్ఎస్ ప్రభావం తగ్గిపోకుండా చూసుకునే విధంగా కెసిఆర్ రాజకీయ చక్రం తిప్పుతున్నారు .

Advertisement

తాజా వార్తలు