తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల లో పోటీ ప్రదానం గా కాంగ్రెస్ మరియు భారతీయ రాష్ట్ర సమితిలో మధ్యలోనే ఉంటుందని ఫైనల్ అయిపోవడంతో ఇప్పుడుఇతర పార్టీల లోని కీలక నేతలు ఈ రెండు పార్టీలలో సర్దుకుంటున్నారు.ముఖ్యంగా భాజపా నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి.
ఆ పార్టీ కీలక నేత , మాజీ ఎంపి వివేక్ తన కుమారుడు తో కలసి కాంగ్రెస్ లో చేరిపోవడంతో షాక్ తిన్న కమలనాధులకు త్వరలోనే మరొక షాక్ తగలబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది .ఆ పార్టీ మరో కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి( Konda Vishweshwar Reddy ) కూడా వివేక్ దారిలోనే ఉన్నారని , ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా శేర్లింగంపల్లి సీటు విషయంలో జనసేన బిజెపి మధ్య నడుస్తున్న పంచాయతీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రదాన కారణం గా తెలుస్తుంది .

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఒక శేర్లింగంపల్లిలోనే అదిక శాతం ఓట్లు ఉన్నాయని, ఇప్పుడు ఆ సీటును జనసేనకు కేటాయిస్తే తమ బలం తగ్గిపోతుందని భావిస్తున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి .ఎట్టి పరిస్థితుల్లోనూ రవి యాదవ్ కి ఆ టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు కొండా .ఒకవేళ పొత్తుల్లో భాగంగా ఆ సీటు గనుక జనసేనకు వెళ్ళిపోతే కాంగ్రెస్ లోకి వెళ్లడానికి కూడా విశ్వేశ్వర్ రెడ్డి రెడీ అవుతున్నారని, ఆ మేరకు కాంగ్రెస్లో ఆయనకు హామీ దక్కిందని కూడా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే వెంకటరెడ్డి ఆయన తనయుడు పార్టీ మారడంతో తల పట్టుకుంటున్న కమల నాడులు ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి కూడా వెళ్ళిపోతే పార్టీ మరింత బలహీన పడుతుందని చెప్పవచ్చు.

ఒక పక్క జనసేన తో పొత్తు పెట్టుకుని కింగ్ మేకర్ గా అవతరిద్దాం అన్న బజాపా ఆశలకు కాంగ్రెస్ గండి కొట్టినట్టే కనిపిస్తుంది.మరోపక్క వివేక్ కుటుంబం చేరికతో కాంగ్రెస్ బలం మరింత పెరిగినట్టు కనిపిస్తుంది .వివేక్ రాకతో కాంగ్రెస్ లో వెయ్యి ఏనుగుల బలం పెరిగినట్లు అయిందని, కేసీఆర్ని గద్దే దించడం కాంగ్రెస్ వల్లే అవుతుందని వివేక్ బలంగా నమ్మడం వల్లే ఆయన కాంగ్రెస్లో చేరారని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి .రానున్న రోజుల్లో మరిన్ని వలసలు బజాపా నుండి కాంగ్రెస్ కి వస్తాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి .నిజానికి కాంగ్రెస్ అసంతృప్తులు బిజెపిలో చెరతారని బజాపా చాలా ఆశలు పెట్టుకుంది .అయితే బారస కాంగ్రెస్ ల మధ్య హోరోహరి పోరు నడవబోతుందనే అంచనాలు ఉండడంతో చాలామంది కాంగ్రెస్ పార్టీతోనే ఉండడానికి మక్కువ చూపుతున్నట్టుగా తెలుస్తుంది.