ఈ విధంగా జనాల్లోకి వెళ్లనున్న బీజేపీ ! భారీ ప్లాన్ తో కిషన్ రెడ్డి 

తెలంగాణ బిజెపిలో పరిస్థితి గందరగోళంగా మారిన నేపథ్యంలో పార్టీని ఒక గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే విధంగా అనేక ప్రణాళికలను రూపొందించుకున్నారు .

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో జిల్లాల్లో కొన్నిచోట్ల పార్టీ నాయకుల్లో నిరాశా నిస్పృహలు అలుముకోవడంతో వాటిని సరిదిద్దేందుకు కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా బీఆర్ఎస్( BRS party ) బలంగా ఉన్న జిల్లాల్లో పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఇక్కడ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా , ఈ జిల్లాలో బిజెపి బలం పెరిగే విధంగా అనేక వ్యూహాలను రూపొందిస్తున్నారు.

 ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య సఖ్యత లేకపోవడం , గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం,  ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండడం,  ఇలా అన్నిటి పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు .ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికోసం మహబూబ్ నగర్ జిల్లా( Mahabubnagar ) కేంద్రంలో ఈ నెల 31న భారీ ర్యాలీ , ముఖ్య నేత సమావేశం నిర్వహించేందుకు పార్టీ వర్గాలను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

ఆయా జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అధికార పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలను, స్థానిక నేతల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా ముఖ్య నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరించనన్నారు .

 యువతకు నిరుద్యోగ భృతి , డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు , దళిత బంధు,  బీసీ బందు వంటి అంశాల్లో జరుగుతున్న అవకతవకల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వీటిని జనాల్లోకి తీసుకువెళ్లి, బీఆర్ఎస్ వైఫల్యాలను హైలెట్ చేయాలనే ఆలోచనతో కిషన్ రెడ్డి ఈ జిల్లా నుంచే ముందుగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు