అనుకున్నదానికంటే సినిమా ఎంతో బాగా వచ్చింది.. ‘తీస్ మార్ ఖాన్’ నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి

మంచి కథ పుట్టాలన్నా.మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలన్నా కూడా దాని వెనుక నిర్మాత అభిరుచి, ఇష్టం దాగి ఉంటుంది.

 Tees Maar Khan Has Shaped Up Beyond Our Expectations: Producer Dr Nagam Tirupath-TeluguStop.com

ఓ నిర్మాతకు కథ, కథనం నచ్చితే అది తెరపైకి వస్తుంది.నిర్మాతల అభీష్టం మేరకు సినిమాలు కార్యరూపం దాల్చుతాయి.

ఎంతో మంది నిర్మాతలు సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వస్తుంటారు.గొప్ప గొప్ప సినిమాలను నిర్మిస్తుంటారు.

అలాంటి ఓ ధ్యేయంతోనే నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త *డా.నాగం తిరుపతి రెడ్డి* ఇండస్ట్రీలోకి వచ్చారు.విజన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు.

*డా.నాగం తిరుపతి రెడ్డి* ప్రస్తుతం విజన్ సినిమాస్ బ్యానర్ మీద ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా *తీస్ మార్ ఖాన్* అనే సినిమాను నిర్మిస్తున్నారు.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది.

ఈ క్రమంలో నిర్మాత *డా.

నాగం తిరుపతి రెడ్డి* ముందుగానే ఈ సినిమాను వీక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.

*తీస్ మార్ ఖాన్* సినిమాను ఇప్పుడే చూశాను.ఎంతో అద్భుతంగా వచ్చింది.

అనుకున్నదానికంటే సినిమా ఎంతో బాగా వచ్చింది.ఆది సాయికుమార్ చాలా కొత్తగా కనిపించారు.

ఆది, పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.సినిమాను వీక్షించిన తరువాత మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం.నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌కు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.

పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి.ఆగస్ట్ 19న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామ’ని అన్నారు.

*స్టూడెంట్, రౌడీ, పోలీస్* గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో *ఆది సాయికుమార్* నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్.ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube