అల్లం పంట సాగులో పోషక ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!

అల్లం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.అల్లం పంటకు( Ginger Crop ) తేమతో కూడిన వేడి వాతావరణం చాలా అనుకూలం.

తాజా వంటకాల్లో, వివిధ పదార్థాల తయారీలో ఉపయోగించడం వల్ల మార్కెట్లో అల్లంకు ఎప్పుడు మంచి డిమాండ్ ధరే లభిస్తుంది.అల్లం పంట సాగుకు( Ginger Farming ) ఇసుకతో కూడిన సారవంతమైన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

అల్లం పంటను ఏప్రిల్ చివరి వారి నుంచి మే రెండవ వారం వరకు నాటుకోవచ్చు.అధిక సూర్యకాంతి, అధిక వర్షపాతం, అధిక తేమ ఉండే వాతావరణం అల్లం పంట సాగుకు చాలా అనుకూలం.

Techniques In Management Of Nutrient Fertilizers In Ginger Crop Cultivation Deta

అల్లం పంట సాగుకు మేలురకం విత్తనాల విషయానికొస్తే.ఆరోగ్యకరంగా ఉండి, రెండు లేదా మూడు మొలకలు వచ్చి సుమారుగా 40 గ్రాముల బరువు ఉండే దుంపలను విత్తనంగా వాడుకోవాలి.ఒక ఎకరం పొలానికి విత్తే దూరం మరియు రకాన్ని బట్టి 600 నుండి 1000 కిలోల విత్తనాలు( Seeds ) అవసరం.

Advertisement
Techniques In Management Of Nutrient Fertilizers In Ginger Crop Cultivation Deta

దుంపలను విత్తన శుద్ధి చేసుకుని నాటుకోవాలి.ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల రిడోమిల్-MZ ను కలిపి ఆ ద్రావణంలో విత్తన దుంపలను ఓ 30 నిమిషాల పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత పొలంలో నాటుకోవాలి.

Techniques In Management Of Nutrient Fertilizers In Ginger Crop Cultivation Deta

అల్లం పంటకు అందించాల్సిన పోషక ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) వేయాలి.150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.ఇక విత్తనం నాటిన 25 రోజుల తర్వాత మూడు కిలోల అమ్మోనియా సల్ఫేట్, 0.5 గ్రాముల ఫాస్ఫరిక్ యాసిడ్, ఒక గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను డ్రిప్ విధానం ద్వారా పంటకు అందించాలి.పంట నాటిన 40 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల ఫాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను కలిపి పంటకు అందించాలి.ఇక ఏవైనా తెగుళ్లు లేదంటే చీడపీడలు ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలిదశలో కడితే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.

తాజా వార్తలు