'విధ్యార్థి'పై టీచర్ 'కీచకపర్వం'!!

రోజు రోజుకూ విధ్యార్థులపై టీచర్లు చెలరేగిపోతున్నారు.నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది.

వివరాల్లోకి వెళితే.నెల్లూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధి గొంతు నులిమి కొట్టిన సంఘటన చోటు చేసుకుంది.

ఈ సంఘటన జిల్లాలోని చిట్టమూరు మండలంలోని గునపాడు గ్రామంలోని పాఠశాలలో జరిగింది.గ్రామస్తులు, పాఠశాల విద్యార్ధుల కథనం ప్రకారం.

పాఠశాలలో పదో తరగతిలో హిందీ సిలబస్ పూర్తి కాలేదని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.అంతేకాకుండా హిందీ పండిట్ శంకరయ్య క్లాస్ రూంలో విద్యార్ధులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

అయితే ఈ విషయాలను గ్రామంలోని అందరికి చెప్పాడనే కోపంతో పదో తరగతి విద్యార్ధి పైడి చెంచయ్యను పీక పట్టుకుని పైకెత్తి కింద పడేశాడని తోటి విద్యార్ధులు చెబుతున్నారు.దీంతో ఆగకుండా పైడి చెంచయ్యను తీవ్రంగా కొట్టాడు.

చెంచయ్య గొంతు వద్ద తీవ్ర గాయం అవడంతో మాట్లాడలేని పరిస్ధితిలో ఉన్నాడు.గాయాలైన చెంచయ్యని గ్రామంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈ విషయంపై గ్రామ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్ కస్తూరయ్య, తల్లిదండ్రులు టీచర్‌ని నిలదీశారు.మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అనేది విద్యార్ధి సంఘాల డిమాండ్.

వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!
Advertisement

తాజా వార్తలు