ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారం..: సజ్జల

ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ఓట్ల తొలగింపుపై టీడీపీ చేస్తున్నది తప్పుడు ప్రచారమని తెలిపారు.

గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీ అక్రమాలు చేసిందని ఆరోపించారు.గతంలో టీడీపీ అక్రమాలపై తాము పోరాడామని చెప్పారు.60 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆయన అవి ఎవరివో తెలియదని పేర్కొన్నారు.ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

అదేవిధంగా దొంగ ఓట్లను తొలగించే పనిలో ఉన్నామన్న సజ్జల టీడీపీ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు.గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటేనని ఎద్దేవా చేశారు.2015 నుంచి 2017 వరకు 50 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని పేర్కొన్నారు.తాము ప్రెష్ ఓటర్ లిస్టు చేయించడంతో 2019లో 3.98 కోట్లకు చేరిందన్నారు.కొన్ని ఓట్లు తొలగించిన తరువాత 2022లో 3.97 కోట్ల ఓట్లు ఉన్నాయన్నారు.అయితే కొన్ని కారణాలతోనే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు.

వైసీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహారిస్తుందని తెలిపారు.దొంగ ఓట్లు చేర్చుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేశారు.

Advertisement
జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు