తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అనే విషయం అందరికీ అర్థమైపోయింది.ఆ పార్టీ సైతం మెజారిటీపైనే లెక్కలు వేసుకుంటోంది.
ఇది వైసిపి సిట్టింగ్ స్థానం కావడం, ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో, తమకు పెద్దగా అవకాశం ఉండదు అని డిసైడ్ అయిపోయింది.అయినా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు, ఆ పార్టీ మెజార్టీ తగ్గించేందుకు ప్రయత్నించాయి.
ఈ సందర్భంగా వైసిపి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించుకుంది అనే ప్రచారం కూడా చేయడంతో పాటు, సోషల్ మీడియా, టీడీపీ అనుకూల మీడియా లో హడావుడి చేశారు.అయితే దొంగ ఓటర్లు అని టిడిపి హడావుడి చేసినా, ఏ ఒక్కరిని పోలీసులు, ఎన్నికల అధికారులకు కానీ పట్టించకుండా కేవలం వీడియోలు తీసి వదిలిపెట్టడంతో ఇదంతా వైసీపీ పై గెలవలేక చేయించిన హడావుడి అనే విషయం వైసీపీ హైలెట్ చేసుకోవడం లో హైలెట్ అయ్యింది.
ఇదిలా ఉంటే, తిరుపతి ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం బాగా తగ్గింది.
మొత్తం ఇక్కడ 17 లక్షల ఓట్లు ఉండగా, సుమారు 11 లక్షల మందికి మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు.
కానీ 2019 ఎన్నికల్లో మాత్రం 100% ఓటింగ్ నమోదవడం, అది ఇప్పుడు 64 శాతానికి పడిపోవడం తో, ఆ తగ్గిన 16 శాతం ఓటింగ్ ప్రభావం ఏ పార్టీ కి దెబ్బేస్తుంది అనేది చర్చగా మారింది.అయితే ఇక్కడ ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీపైన ఎక్కువ పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.2019 ఎన్నికల్లో టిడిపి కి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి.ఇప్పుడు అది బాగా తగ్గింది.16 శాతం ఓటింగ్ కూడా టిడిపికి పడాల్సినవే అనే విషయం తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు.2.50 లక్షల ఓట్లు మాత్రమే ఇప్పుడు టీడీపీకి రావచ్చని అంచనా నెలకొంది.బీజేపీకి దాదాపు 50 వేల ఓట్ల వరకూ వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా.

మొత్తంగా చూస్తే బిజెపి టిడిపి లకు కలిపి మూడున్నర లక్షల వరకు పడవచ్చని మిగిలిన 7.50 లక్షల ఓట్లు వైసీపీకి దక్కే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు.గతంతో పోలిస్తే టిడిపి ఈ విధంగా బలహీనం కావడానికి సొంత తప్పిదాలు కూడా కారణం అవ్వొచ్చు అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇక తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు, టిడిపి నాయకులు అంతా ఎన్నికల ప్రచారం చేపట్టినా, వైసీపీ పై అవినీతి ఆరోపణలు చేసి, ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేలా చేసుకోవడంలో ఆ పార్టీ నేతలు విఫలం కావడంతోనే గతం కంటే ఇప్పుడు టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గేందుకు ఆస్కారం ఏర్పడింది అనే విషయం ఇక్కడ హైలైట్ అవుతోంది.
దీంతో టిడిపిలో మరింత కంగారు అనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని తాము పదేపదే ప్రస్తావిస్తున్నా, ఇప్పుడు వైసీపీకి గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తే, టిడిపి మరింత బలహీనం అవుతుందని, వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత తెలియదనే విషయం అర్థమవుతుందని, దీని ద్వారా రానున్న రోజుల్లో టిడిపి కోలుకునే అవకాశాలు సన్నగిల్లుతాయి అని, ఆ పార్టీ నేతలంతా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.