తండ్రికే పోటీగా టీడీపీ సీనియ‌ర్ వారసుడు...బాబు డెసిషన్ మారుతుందా ?

చింతకాయల అయ్యన్నపాత్రుడు.టీడీపీకి వీర విధేయుడు.

ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకుడు.టీడీపీని ఎంతోమంది నాయకులు వీడినా కూడా అయ్యన్న మాత్రం పార్టీతోనే ఉన్నారు.ఇక 1983, 1989, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అయ్యన్న నర్సీపట్నం నుంచి అదిరిపోయే విజయాలు అందుకున్నారు.1989, 2009, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.ఇక ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో, పార్టీ కోసం కష్టపడుతున్నారు.

జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖపట్నంలో పలువురు టీడీపీ నేతలు నానా ఇబ్బందులు పడుతున్న కూడా, అయ్యన్న దూకుడుగానే అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు.చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ, విశాఖలో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

ఇక అయ్యన్నకు తోడుగా ఆయన తనయుడు చింతకాయల విజయ్ కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. విజయ్ కూడా అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు.

Advertisement
TDP Senior Successor To Compete With Father,ap,ap Political News,latest News,tdp

రామతీర్ధం ఘటన నుంచి విజయ్ ఏపీ రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయ్యారు.

Tdp Senior Successor To Compete With Father,ap,ap Political News,latest News,tdp

అయితే విజయ్ ఇలా యాక్టివ్‌గా ఉండటానికి కారణం లేకపోలేదు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ టీడీపీలో యాక్టివ్ అయ్యారు.అయితే 2019 ఎన్నికల్లోనే విజయ్ పోటీ చేయాల్సి ఉంది.

కానీ చంద్రబాబు పెట్టిన రూల్ వల్ల పోటీ చేయలేకపోయారు.ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చెప్పడంతో, అయ్యన్న ఒక్కరే పోటీ చేశారు.

దీంతో విజయ్‌కు ఛాన్స్ రాలేదు.

Tdp Senior Successor To Compete With Father,ap,ap Political News,latest News,tdp

ఇక వచ్చే ఎన్నికల్లో అయ్యన్న, విజయ్‌లు పోటీ చేయాలని చూస్తున్నారు.బాబు ఏమన్నా నిర్ణయం మార్చుకుంటే ఇద్దరికీ పోటీ చేసే అవకాశం ఉంటుంది.లేదంటే కుమారుడు కోసం అయ్యన్న పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

Advertisement

మరి చూడాలి అయ్యన్న తనయుడుకు బాబు టిక్కెట్ ఇస్తారో లేదో.!.

తాజా వార్తలు