టీడీపీవి చిల్లర రాజకీయాలు.. వైసీపీ నేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తారకరామానగర్ లో చోటు చేసుకున్న ఘర్షణపై వైసీపీ నేత దేవినేని అవినాశ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదంతా టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలని ఆరోపించారు.వైసీపీ నేతలపై దాడి చేసి వాళ్లే ఫిర్యాదు చేయడం వింతగా ఉందన్నారు.

టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.గద్దె రామ్మోహన్ పేరుకే పెద్ద మనిషన్న దేవినేని అవినాష్ బుద్ది మాత్రం హీనమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ తనకు సీటు ఖరారు చేశాక కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని వెల్లడించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020