ఏపీలో టీడీపీ మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.‘కళ్లు తెరిపిద్దాం’ పేరుతో గంతలు కట్టుకొని పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకోని టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 గంటలకు మధ్య అందరూ కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్ద బాల్కనీలు, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా నిలవాలని కోరారు.అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.







