గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెబుతున్నారు టీడీపీ వారి ఇంటికీ వెళ్లాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశించారు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీ కి చెందిన వారింటికీ వెళ్తున్నారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేలు కోరుతున్నారు టీడీపీ ప్రోద్భలంతో కొందరు సంక్షేమ పథకాలకు అర్హత లేకపోయినా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు వాటిని వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యేలను నిలదీస్తున్న వారు టీడీపీ కార్యకర్తలే గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా ఎవరూ ఇంటింటికీ వెళ్లలేకపోయారు.సంక్షేమం,అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక తెలుగుదేసం వారు నిరసన అని క్రియేట్ చేస్తున్నారు
మూడేళ్లలో ఇంత చేస్తున్నాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నాం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అసంతృప్తితో లేరు సీఎం జగన్ రాగానే అన్ని చోట్లా అవినీతి లేకుండా కట్టడి చేశారు అభివృద్ధి చూడాలంటే ఓడిపోయిన తెలుగు దేశం నేతలు, అభ్యర్థులను కార్యక్రమానికి పంపాలి దమ్ము ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నిటినీ వీడియో చేసి పెట్టాలిఅర్హత ఉండి సహాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరు వ్యవసాయ మోటార్లకు మీటర్లకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది లక్ష సార్లు చెప్పాం వ్యవసాయ మీటర్లు బిగింపు వెనుక డొంక తిరుగుడు ఏదీ లేదు
శాశ్వతంగా రైతులకు లబ్ది, డిపార్టుమెంట్ కు అకౌంటబులిటీ కోసం మీటర్లు ఏర్పాటు మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి ఆర్ధికంగా వెసులుబాటు వస్తుంది మీటర్లు బిగించడంలో తప్పేముందో అర్ధం కావడం లేదు రైతులకు ఆత్మగౌరవంతో తనకు రావాల్సింది తీసుకునే పరిస్ధితి వస్తుంది మీటర్ల ఏర్పాటు శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతమైందిఉచిత విద్యుత్ పై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు మీటర్ల ఏర్పాటుపై రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు ప్రతి పక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంపై బండలు వేయాలని వేస్తున్నారు.