కాకినాడ: జగన్ ప్రభుత్వంలో అరాచకం రోజు రోజుకు పేట్రేగిపోతుందని అరాచక పాలన కు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే, ఉన్నాయని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప అన్నారు.వీరి పాలనకు చరమ గీతం పాడే రోజులు ఆసన్నమైందని, జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన వారిని అరెస్టు చేయడం, ప్రతి పక్ష పార్టీపై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి శూన్యమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల కార్యక్రమం తల పెడితే ఆ కార్యక్రమం లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయ భ్రాంతులు సృష్టించడం ప్రజా స్వామ్యానికి సిగ్గు చేటని దీనికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.తమ నాయకుడు లోకేష్ ఎక్కడికి వెళ్లినా అరెస్టు చేయడం జగన్ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు.