Pawan Ganta srinivasa rao: వైజాగ్‌లో పవన్‌ను సీక్రెట్‌గా కలిసిన టీడీపీ ఎమ్మెల్యే?

వైజాగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమైన అయిన విషయం తెలిసిందే.

సమావేశం అనంతరం వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌లో బస చేసిన పవన్ తన పార్టీ  సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.

  తాజాగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా నోవాటెల్‌ను సందర్శించారు.గంటా గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇటీవల రాజీనామా సమర్పించారు.అయితే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉంది.

గంటా రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నేపథ్యంలో ఆయన జనసేన, వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ ఊహాగానాల నేపధ్యంలో పవన్ ఉండగానే గంటా నోవాటెల్‌ను సందర్శించడం ఆసక్తిని కలిగిచింది, 2024లో జరగనున్న ఏపీ ఎన్నికలకు ముందు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు పవన్‌తో భేటీ అయి పవన్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

అయితే గంటా నోవాటెల్‌కి పవన్‌ను కలవడానికి వెళ్లలేదని, బదులుగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ను కలవడానికి వెళ్లారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.గంటా, పవన్‌ల మధ్య  భేటీ జరిగి ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల పట్ల పవన్ చాలా యాక్టివ్ గా ఉన్నారు.వైసీపీపై ఆయన దాడి తీవ్రతరం చేశారు.దీంతోొ ప్రజల్లో పవన్ సానుకూలత పెరిగింది.

త్వరలో వివిధ పార్టీలోని నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.అందులో గంట కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ప్రజాసామ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన గంటా ఇప్పుడు జనసేనలోనూ అదే పాత్ర పోషించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.అయితే గంటా జనసేన పార్టీలో చేరితే ఆయనతో పాటు చాలా మంది టీడీపీ నేతలు జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు