చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేత.. ?

ఏపీలో టీడీపీ పరిస్దితి అందరికి తెలిసిందే.కాగా తెలంగాణలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ మాయం అయ్యింది.

ఉన్న ఏ అరకొర నేతలు ఎలాగోలా పరిస్దితులకు తట్టుకుని నెట్టుకొస్తున్నారు.ఈ క్రమంలో పట్టు ఉన్న ఏపీలోనే టీడీపీ ఖాళీ అవుతుండగా ఏం చేయలేని అధినేత తెలంగాణలో ఆ పార్టీ గురించి ఆలోచించడం వ్యర్ధమే అవుతుంది.

Tdp Leader Shocked By Chandrababu Telangana, Siddipet, TDP Leader, Shocked, Cha

ఇకపోతే ప్రస్తుతం తెలుగుదేశం అధినేతకు సిద్దిపేట నియోజకవర్గం ఇంఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ షాకిచ్చారు.తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ విషయాన్ని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.అంతే కాకుండా తన రాజీనామాను సహృదయంతో ఆమోదించాలని తెలియచేశారు.

Advertisement

ఇకపోతే ఈయనతో పాటుగా వెంకటేశం, తుమ్మల రాజేశం, సత్తయ్య వెంకటేశ్వరరావు, నరసింహారెడ్డి, తదితరులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు