రాజకీయాల్లో త్యాగాలు సహజమే.పార్టీ అధినేత ఆదేశించారనో.
లేదా మరో ముఖ్యమైన పదవి ఇస్తారనో.అనుభవిస్తున్న పదవులు త్యాగాలు చేసిన నాయకులు చాలా మంది గత చరిత్రలో మనకు కనిపిస్తారు.
కానీ, ప్రస్తుతం త్యాగాలంటే కష్టమే.అందులో.
ప్రతిపక్షం టీడీపీ త్యాగాలు చేయడం అంటే.మరింత కష్టం.
అయినా కూడా ప్రస్తుతం ఓ విషయం పార్టీ తమ్ముళ్ల మధ్య హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.అదేంటంటే.
ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్న గల్లా అరుణకుమారి.తన పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ఆమెను ఎవరూ కోరకుండానే ఆమె తన పదవికి రాజీనామా చేసి.చంద్రబాబుకు ఇచ్చేశారు.దీంతో అసలు ఏం జరిగింది? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.అరుణ కుమారి మాటల్లో చెప్పాలంటే.
పార్టీలో నూతన నియామకాలు చేపడుతున్న తరుణంలో అధిష్ఠానం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకే పక్కకు తప్పుకున్నట్టు చెప్పాలి.కానీ ఇది నిజమేనా? ఇంతగా పార్టీకి సహకరించే నాయకులు ఉన్నారా? అంటే కష్టమే.పైగా కాంగ్రెస్ వంటి అతిపెద్ద పార్టీ నుంచి వచ్చి 2014కు ముందు టీడీపీలో చేరిన అరుణ.ఇప్పుడు ఆకస్మికంగా ఇంత నిర్ణయం తీసుకున్నారంటే.దీనివెనుక ఏదైనా జరిగి ఉండాలి ? లేదా.స్వీయ స్వార్థమైనా ఉండి ఉండాలి! ఇదే ఇప్పుడు చర్చకు వస్తోంది.
విషయంలోకి వెళ్తే.ప్రస్తుతం అరుణ యాక్టివ్ గా లేరు.ఈ నేపథ్యంలో తన కుమారుడిని మరింత యాక్టివ్ చేయడంతో పాటు పార్టీలోనూ కీలకంగా బాధ్యతలు అప్పగించేలా చేయాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే ఆమె తన పదవిని వదులుకున్నారని అంటున్నారు సీనియర్ నాయకులు.
ప్రస్తుతం అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు.ఎంపీగా ఆయన పార్లమెంటులో బాగానే వాదిస్తున్నారు.
అనేక చర్చల్లోనూ పాల్గొంటున్నారు.అయితే.
ఎంపీగా ఉండి.పార్టీలో నిర్ణయాలు తీసుకునే రేంజ్‌లో లేకపోవడం, పొలిట్ బ్యూరో అయితే బాగుంటుందని భావించారు.
ఈ క్రమంలో ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.ఆయన మీరు వదులుకుంటే.ఆయనకు ఇస్తానని చెప్పడంతో గల్లా అరుణ.తన పదవిని వదులకుని కుమారుడికి లైన్ క్లియర్ చేశారని అంటున్నారు సీనియర్ నాయకులు.
ఇదే నిజమా? పొలిట్ బ్యూరో నియామకాలు జరిగితేనే తప్ప తెలియదు.చూడాలి ఏం జరుగుతుందో.!!
.