TDP: ఆ ఆరు స్థానాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి( TDP ) తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.ఇంకా ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం లో అనేక ఇబ్బందులు,  మొహమాటలు ఉండడంతో వీటిని పెండింగ్ లో పెట్టారు.

మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Former minister Ganta Srinivasa Rao ) తనకు భీమిలి టికెట్ కేటాయించాల్సిందిగా టిడిపి అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారు.

అయితే గంటా ను భీమిలి నుంచి కాకుండా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసారు.అయితే ఈ విషయంలో గంటా ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, భీమిలితో పాటు చీపురుపల్లి నియోజకవర్గం పెండింగ్లో పెట్టారు.

Advertisement

అలాగే శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపికి కేటాయించడంతో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు( Former Minister Kala Venkatarao ) చీపురుపల్లి టికెట్ ను తనకు కేటాయించాల్సిందిగా కోరుతున్నారు.దీంతో చీపురుపల్లికి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది.

అలాగే నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించడంతో అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న బంగారు రాజు పేరును భీమిలి ( Bhimili )కి టిడిపి అధిష్టానం పరిశీలిస్తోంది.ఆయా స్థానాల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బంగార్రాజు   విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.దీంతో వీటిని పెండింగ్ లో పెట్టారు.

విజయనగరం లోక్ సభ స్థానాన్ని బిజెపి నుంచి తీసుకుని దానికి బదులుగా రాజంపేట టిక్కెట్ ను ఇచ్చే విషయంపై టిడిపి పరిశీలిస్తోంది.అదే జరిగితే విజయనగరం లోక్ సభ స్థానానికి కళా వెంకట్రావు పేరును ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ప్రకాశం జిల్లా దర్శి విషయానికి వస్తే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ( Former minister Sidda Raghavrao )పార్టీలోకి వస్తానని చెబుతున్నారు.కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండడంతో దర్శి నుంచి సిద్ధ రాఘవరావు కోడలు పేరును పరిశీలిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్ర గౌడ్ తో పాటు, వైకుంఠం మల్లికార్జున ఆయన సోదరుడు భార్య జ్యోతి పేర్లు పరిశీలిస్తున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ను జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడి పేరును పరిశీలిస్తున్నారు.

Advertisement

అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు.అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్ కోసం చెంగల్ రాయుడు, జగన్మోహన్ రాజుల మధ్య పోటీ నెలకొంది.

ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక  విషయం ఒక కొలిక్కి వస్తే ఆరు స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి సిద్ధం అవుతోంది.

తాజా వార్తలు