టీడీపీ బాధ్యతలు బాలయ్యకు అప్పగిస్తే బెటర్.. టీడీపీ అభిమానుల భావన ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) కావడంతో పొలిటికల్ లెక్కలు శరవేగంగా మారుతున్నాయి.

ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న తరుణంలో చంద్రబాబు రిలీజయ్యే వరకు టీడీపీ బాధ్యతలను బాలయ్యకు అప్పగిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా బాలయ్య పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో బాలయ్య సైతం పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

బాలయ్య చేతికి పార్టీ బాధ్యతలు వస్తే టీడీపీ( TDP ) మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లోకేశ్( Nara Lokesh ) కు పొలిటికల్ గా సరైన అనుభవం లేదు కాబట్టి బాలయ్యే టీడీపీ పగ్గాలు చేపట్టే సరైన నాయకుడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొంతకాలం పాటు బాలయ్య సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని టీడీపీ నేతలు( TDP Leaders ) భావిస్తున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

బాలయ్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు సిద్ధమైందని చెప్పుకొచ్చారు.అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని బాలయ్య అన్నారు.

అభివృద్ధి అంటే వైసీపీ ఓర్వలేదని బాలకృష్ణ( Balakrishna ) చెప్పుకొచ్చారు.పది రూపాయలు వేసి వంద రూపాయలు నొక్కేస్తున్నారని చెత్తచెత్త ట్యాక్స్ లు వేస్తున్నారని బాలయ్య కామెంట్లు చేశారు. ఏపీలో జాబ్ క్యాలెండర్( AP Job Calendar ) ద్వారా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని బాలయ్య చెప్పుకొచ్చారు.

బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మాట ఇస్తే తప్పని పార్టీ తెలుగుదేశం పార్టీ అని బాలయ్య కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

బాలయ్య వైసీపీపై ఒకింత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?
Advertisement

తాజా వార్తలు