నియోజకవర్గాల ఇన్చార్జిలతో టిడిపి అధినేత చంద్రబాబు సమీక్ష

రానున్న ఎన్నికల సందర్భంగా టిడిపి గెలుపే ధ్యేయంగా పని చేయాలని నిర్ణయం తీసుకుంది.చంద్రబాబు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నేడు మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంపై నారా లోకేశ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

TDP Chief Chandrababu's Review With In-charges Of Constituencies-నియోజ

నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై చర్చించారు.ఇతర నియోజకవర్గాల ఇన్చార్జిలకు కూడా గెలుపే పరమావధి అని చెప్పారు,ఎన్నికలు రానున్నందున, పార్టీ కోసం కష్టపడాలని సూచించారు.

నియోజకవర్గంలో అందరినీ కలుపుకునిపోవడంపై శ్రద్ధ చూపాలని తెలిపారు.కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు