Tammareddy Bharadwaaj : ఆర్.నారాయణమూర్తిపై పొగడ్తల వర్షం కురిపించిన తమ్మారెడ్డి భరద్వాజ?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) గురించి మనందరికీ తెలిసిందే.

ఏ విషయాన్ని అయినా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పిస్తూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు విమర్శలు చేస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటాడు.మరి కొన్నిసార్లు సెలబ్రిటీలపై సినిమాల రిజెల్ట్ పై సంచలన వాఖ్యలు చేసి లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.

ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు.

తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు తమ్మారెడ్డి భరద్వాజ.ఇది ఇలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ పీపుల్స్ స్టార్ అయిన ఆర్ నారాయణమూర్తి ( R Narayanamurthy )గురించి స్పందిస్తూ ఆయనపై వర్షం కురిపించారు.ఆర్ నారాయణ మూర్తి గురించి మనందరికీ తెలిసిందే.

Advertisement

ఆయన స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు.నమ్మిన సిద్ధాంతాల కోసం తన జీవితాన్ని మొత్తం సినిమాకి అంకితం చేశాడు.

ప్రజలలో మార్పు రావడం కోసం రైతుల బాధలను కథలుగా మార్చి సినిమాలను తీసి పీపుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.అటువంటి ఉన్నతమైన వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదు అంటూ ప్రశంసలు కురిపించారు తమ్మారెడ్డి భరద్వాజ.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.తాను నమ్మిన సిద్ధాంతం కోసం అంత పెద్ద స్టార్ డమ్ ను వదిలేసిన ఏకైక నటుడు ఆర్ నారాయణ మూర్తి.తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేసిన వారిలో ఆర్.నారాయణమూర్తి ముందు ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇదే విషయం నేను ఆయనకు కూడా ఎన్నోసార్లు చెప్పాను.

సిద్ధాంతాలు వదలకుండా సినిమాలు తీసే విధానాన్ని మార్చండి అని కానీ ఆయన ఏ రోజు కూడా నా మాట వినలేదు.నమ్మిన సిద్ధాంతాల కోసం మొత్తం అలాగే తన పంతాలోనే సినిమాలు తీస్తూ వచ్చాడు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

అలా కనుక చేస్తే ఇప్పుడు ఆయన ఎన్నో కోట్లు సంపాదించేవాడు.కానీ అలా చేయకుండా ప్రస్తుతం రోడ్లపై కాలినడకన లేదంటే ఆటోలో తిరుగుతూ ఉన్నారు అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.

Advertisement

ఆయన గొప్పతనం మరి ఎవరికి రాదు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ఆర్ నారాయణ మూర్తి ఇంకా అలానే ఉన్నారు అని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు