సుధీర్ సినిమాలో హీరోయిన్ గా ఆ స్టార్ హీరోయిన్..?

జబర్దస్త్ కామెడీ షో ( Jabardasth )ద్వారా విపరీతంగా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్( Sudigali Sudeer ).టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు .సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో కూడా అయ్యాడు .ఇతర సినిమాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు చేసాడు .ఇక సుధీర్ యాంకర్ రష్మీ ( Rashmi Gautam )తో ఆన్ స్క్రీన్ లో నడిపిన లవ్ ట్రాక్ కూడా బాగా క్లిక్ అయింది .ప్రస్తుతం సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనేంతలా గుర్తింపు సాధించాడు.

 Tamil Actress To Romance Sudigali Sudheer In His Next,jabardasth,sudigali Sudeer-TeluguStop.com
Telugu Ivana, Jabardasth, Rashmi Gautam, Sudigali Sudeer, Pandugod-Movie

ht

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుధీర్ హీరోగా మరో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు .ఇందులో తమిళ హాట్ బ్యూటి సుధీర్ సరసన నటించనున్నట్టు తెలుస్తుంది .గతంలో సుధీర్ హీరోగా చేసిన.త్రి మంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, చిత్రాలు అంతగా హిట్ కాలేదు.

 Tamil Actress To Romance Sudigali Sudheer In His Next,Jabardasth,Sudigali Sudeer-TeluguStop.com

తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) సమర్పించిన వాంటెడ్ పండుగాడ్( Wanted Pandugod ) లో ఒక హీరోగా చేశాడు.ఈ చిత్రాల తర్వాత గతేడాది గాలోడు ( Galodu )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి.రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది…

Telugu Ivana, Jabardasth, Rashmi Gautam, Sudigali Sudeer, Pandugod-Movie

ఇప్పుడు అందరూ మెచ్చేలా స్టార్ డమ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు సుధీర్.ఇందులో భాగంగా తన తర్వాతి సినిమాను ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ డైరెక్టర్ దశరథ్ తో చేస్తున్నట్లుగా వార్తలుగ హల్ చల్ చేశాయి.హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లవ్ టుడే సినిమా లో హీరోయిన్ గా నటించింది మంచి పేరు తెచ్చుకున్న ఇవానా ( Ivana )హీరోయిన్ గా నటిస్తుంది అనే టాక్ బాగా వినిపిస్తుంది…ఇక ఈవిడ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తే మాత్రం సుధీర్ కెరియర్ లో మరో హిట్ సినిమా పడటం కాయం అని ఆయన అభిమానులు సంతోషం లో ఉన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube