ఫోటో టాక్ : నడుముపై ట్యాటూ అదిరిందంటున్న నెటిజన్లు....

తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన "యుగానికొక్కడు" అనే తమిళ అనువాద చిత్రం లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించిన తమిళ ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా జర్మైన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది దీంతో ప్రస్తుతం తమిళం తెలుగు సినీ పరిశ్రమలో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

అయితే సినిమాల పరంగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా తన వైవాహిక జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దీనికితోడు తమిళ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో అప్పట్లో ఆండ్రియా ప్రేమలో పడిందని కానీ ఇరువురి కుటుంబ సభ్యులు నుంచి వీరిద్దరి పెళ్ళికి అంగీకారం లభించ లేదని అందువల్లనే ఈ పెళ్లి పెటాకులు అయిందని పలు వార్తలు బలంగా వినిపించాయి.

Tamil Actress Andrea Jeremiah Tattoo Showing Pic Viral, Tamil Actress, Andrea Je

అయితే ఈ మధ్యకాలంలో నటి ఆండ్రియా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడూ తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు కూడా షేర్ చేస్తుంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో వల్ల మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ ఫోటోలో ఆండ్రియా తన సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ అలాగే తన నడుము పై ఉన్నటువంటి సీతాకోక చిలుక టాటూ ని చూపిస్తూ నడుము అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది.దీంతో కొందరు నెటిజనులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 35 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఆండ్రియా తన వన్నె తరగని అందంతో మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Tamil Actress Andrea Jeremiah Tattoo Showing Pic Viral, Tamil Actress, Andrea Je

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఆండ్రియా ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన "మాస్టర్" అనే చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో నటించింది.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కాగా ప్రస్తుతం ఆండ్రియా తెలుగు, తమిళ, భాషలలో కలిపి దాదాపుగా 4 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా మరో రెండు చిత్రాలు తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు