తమన్నా 'నవంబర్ స్టోరీ' షార్ట్‌ రివ్యూ

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో కలిపి పలు సినిమాల్లో నటించింది.

ముద్దుగుమ్మ తమన్నా 11త్ అవర్ వెబ్‌ సిరీస్ తో ఓటీటీ పై అడుగు పెట్టింది.

ఆహా లో స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్ నిరాశ పర్చింది.తమన్నా ఇలాంటి వెబ్‌ సిరీస్ ను ఎలా కమిట్ అయ్యింది అంటూ విమర్శలు వచ్చాయి.

Tamanna November Story Web Series Review , 11 Hour Web Series, Disney Hotstar,

ఇలాంటి వెబ్ సిరీస్‌ లు తెలుగులో ఎలా ఆకట్టుకుంటాయని అనుకుంది అంటూ తమన్నా ను కొందరు ట్రోల్‌ చేశారు.టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్ లో వెబ్‌ సిరీస్ చేసింది మొదట తమన్నా గా గుర్తింపు దక్కించుకుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా అప్పుడే రెండవ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నవంబర్‌ స్టోరీ పేరుతో ఒక వెబ్‌ సిరీస్‌ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.

Advertisement

తమన్నా నటించి ఆ వెబ్‌ సిరీస్ నిన్న డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ మొదలయ్యింది.రామ్ సుబ్రమణ్యన్‌ దర్శకత్వం లో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ ను చాలా ఇంటెస్ట్రింగ్‌ గా మల్చారు.

కాని సిరిస్‌ లో సస్పెన్స్ కోసం క్రియేట్‌ చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. చివరి పార్ట్ లో మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో గందరగోళం సృష్టించాడు.

ఏమాత్రం ఆకట్టుకోని సస్పెన్స్ థ్రిల్లర్‌ సన్నివేశాలు ఈ వెబ్‌ సిరీస్ లో చాలా ఉన్నాయి.తమన్నా నటన సహజ సిద్దంగా చాలా బాగుంది.

తండ్రిని కాపాడుకునేందుకు మదన పడే ఒక యువతి పాత్రలో ఆమె కనిపించి మెప్పించింది.మిల్కీ బ్యూటీ తమన్నా ఈ వెబ్ సిరీస్ తో కూడా సక్సెస్‌ ను అయితే దక్కించుకోలేక పోయింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

కాని నటిగా మాత్రం మొదటి దాని కంటే ఈ వెబ్‌ సిరీస్ కు ఎక్కువ స్కోప్‌ దక్కింది.తమన్నా ఎమోషనల్‌ తో పాటు యాంగ్రీ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది.

Advertisement

దర్శకుడు చేసిన మిస్టేక్ తో వెబ్ సిరీస్ లో కొన్ని మైనల్‌ లు ఉన్నాయి.అవి మినహా చాలా ఇంట్రెస్ట్‌ గానే కథనంను సాగించారు.

తాజా వార్తలు