Cold and cough relief drink: ఒక్కరోజులో జలుబు, దగ్గు తగ్గాలా? అయితే ఇలా చేయండి!

ప్రస్తుత చలికాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.

వీటి వల్ల ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.

ఒక్కోసారి జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా వచ్చేస్తుంటుంది.దాంతో ఆయా సమస్యలను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే కనుక కేవలం ఒక్క రోజుల్లోనే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్లు అల్లం పొడి వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ పొడి అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో తయారు చేసి పెట్టుకున్న పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్ట‌వ్‌ ఆఫ్ చేసి తయారు చేసుకున్న డ్రింక్ ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ డ్రింక్ ను ఉదయం, సాయంత్రం తీసుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి జలుబు, దగ్గు సమస్యలను తరిమికొడతాయి.

అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్న దూరం అవుతాయి.కాబట్టి జలుబు, దగ్గుతో మదన పడుతున్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు