మెద‌డు వేగంగా ప‌ని చేయాలా..అయితే ఇవి తీసుకోండి?

ప్ర‌స్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తూ కోరుకున్న రంగంలో స‌క్సెస్ అవ్వాలంటే ఖ‌చ్చితంగా మెద‌డు వేగంగా ప‌ని చేయాల్సిందే.మ‌రి మెద‌డు వేగంగా ప‌ని చేయాలి అంటే ఏం చేయాలి.

? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.? అన్న విష‌యాలు ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.మెద‌డు వేగంగా ప‌ని చేసేందుకు బ్లూ బెర్రీస్ అద్భుతంగా స‌హాక‌రిస్తాయి.

బ్లూ బెర్రీస్‌లో ఉండే యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెద‌డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందుకే డైలీ డైట్‌లో బ్లూ బెర్రీస్ తీసుకుంటే మంచిది.అలాగే గుమ్మడికాయ గింజలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బ్రెయిన్ సూప‌ర్ స్పూడ్‌గా ప‌ని చేస్తుంది.

గుమ్మ‌డి కాయ గింజ‌ల్లో అధికంగా ఉండే జింక్ జ్ఞాప‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మెద‌డు వేగంగా ప‌ని చేసేలా చేస్తుంది.మెద‌డు ఆరోగ్యాన్ని పెంచ‌డంలో ట‌మాటా కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ట‌మాటాలో పుష్క‌లంగా ఉంటుంది.ఈ యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నాశ‌నం చేసి.బ్రెయిన్ షార్ప్ అయ్యేలా చేస్తుంది.

మెద‌డు చురుగ్గా ప‌ని చేయాలంటే వారంలో రెండు సార్లు ఖ‌చ్చితంగా చేప‌లు తినాలి.చేప‌ల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు మెద‌డు ఆరోగ్యాన్ని పెంచుతారు.

దాంతో బ్రెయిన్ వేగంగా ప‌ని చేస్తుంది.బ్రెయిన్ ఫాస్ట్‌గా ప‌ని చేయాలంటే మంచి నిద్ర అవ‌స‌రం.

అందుకే ప్ర‌తి రోజు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్ర పోవాలి.అదే స‌మ‌యంలో ఒత్తిడికి దూరంగా ఉండాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ధూమ‌పానం, మ‌ద్య‌పానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిల్స్ ఫుడ్స్‌, షుగ‌ర్‌తో త‌యారు చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని డైట్‌లో నుంచి క‌ట్ చేయాలి.

Advertisement

తాజా వార్తలు