ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ గెలిచినందుకు తెలంగాణా కమలం నాయకులు యమ సంబరపడిపోతున్నారు.పండుగ చేసుకుంటున్నారు.
ఈ ఉత్సాహంలో వారికి పార్టీ భవిష్యత్తు అద్భుతంగా కనబడుతోంది.వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ గెలుస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
కాంగ్రెసును తరిమి కొట్టాలని ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాన్ని ప్రజలు నిజం చేశారని అన్నారు.ప్రజలు కాంగ్రెసును తరిమి కొట్టారుగానీ బీజేపీని అందలం ఎక్కించలేదు కదా.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా కాంగ్రెసును తరిమి కొట్టాలనే పిలుపునిచ్చాయి.ఆ పార్టీల పిలుపుకు జనం రియాక్ట్ అయ్యారని అనుకోవచ్చు కదా.మొత్తం మీద తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ఆశ కమలం నాయకుల్లో దండిగానే ఉంది.







