ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా? అయితే మీకు మెగ్నీషియం లోపం ఉన్న‌ట్టే!

శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం ఒక‌టి.శ‌రీరంలో మెగ్నీషియం పుష్క‌లంగా ఉన్న‌ప్పుడే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

కండ‌రాలు, నాడులు స‌రిగ్గా ప‌ని చేస్తాయి.ర‌క్త పోటు స్థిరంగా ఉంటుంది.

ఎముక‌ల బ‌లంగా మార‌తాయి.హార్ట్ బీట్ కంట్రోల్‌లో ఉంటుంది.

ఫుడ్ ద్వారా తీసుకునే ప్రోటీన్ స‌క్ర‌మంగా జీర్ణం అవుతుంది.అందుకే శ‌రీరానికి మెగ్నీషియం ఎంతో అవ‌స‌రం అని నిపుణులు చెబుతారు.

Advertisement
Symptoms Of Magnesium Deficiency In Human! Symptoms Of Magnesium Deficiency, Mag

అయితే, ఈ మ‌ధ్య కాలంలో మెగ్నీషియం లోపంతో బాధ ప‌డుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది.కానీ, చాలా మంది త‌మ‌కు మెగ్నీషియం లోపం ఉంద‌నే గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.

వాస్త‌వానికి మెగ్నీషియం లోపిస్తే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా శ‌రీరంలో స‌రిప‌డా మెగ్నీషియం లేన‌ప్పుడు కండరాలు తీవ్రంగా అల‌సిపోతాయిదాంతో కండరాల నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Symptoms Of Magnesium Deficiency In Human Symptoms Of Magnesium Deficiency, Mag

అలాగే మెగ్నీషియం లోపించిన‌ప్పుడు ఆక‌లి చాలా ఎక్కువ‌గా ఉంటుంది.కొంద‌రిలో మాత్రం అస‌లు ఆక‌లే ఉండ‌దు. ఏం తిన్నా వాంతులు అవుతుంటాయి.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

వికారంగా ఉంటుంది.శ‌రీరంలో మెగ్నీషియం త‌గ్గిన‌ప్పుడు గుండె ద‌డ‌, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, ఆందోళ‌న, ఒత్తిడి వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి.

Symptoms Of Magnesium Deficiency In Human Symptoms Of Magnesium Deficiency, Mag
Advertisement

అంతేకాదు తీవ్ర‌మైన నీర‌సం, అల‌స‌ట‌, చేతుల కాళ్లు స్ప‌ర్శ లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి, చికాకు, త‌ల‌నొప్పి, ర‌క్త పోటు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం వంటివి కూడా మెగ్నీషియం లోపం ల‌క్ష‌ణాలే.అలాంట‌ప్పుడు ఆల‌స్యం చేస్తూ కూర్చోకుండా డైట్‌లో నట్స్‌, సీడ్స్‌, ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర, అవకాడో, అర‌టి పండు, డార్క్ చాక్లెట్‌, చేప‌లు, బ్రౌన్ రైస్, ఓట్స్, ఖర్జూరాలు, బఠాణీలు వంటి ఆహారాల‌ను చేర్చుకోండి.ఎందుకంటే, ఈ ఆహారాల్లో మెగ్నీషియం పుష్క‌లంగా ఉంటుంది.

తాజా వార్తలు