ఏపీ అసెంబ్లీలో( AP Assembly ) మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో పది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు.
సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుకు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు( TDP Members ) సభలోనూ నిరసనకు దిగారు.ప్రజా వ్యతిరేక మరియు రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలోనే స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ సభ్యులు స్పీకర్ పై కాగితాలను చించి విసిరారు.దీంతో టీడీపీ సభ్యులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి,( Gorantla Butchaiah Chowdary ) చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) వెలగపూడి రామకృష్ణ, రామరాజు, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయులను స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.