ఏపీలో మరో పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు !

విధులు నిర్వహిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది.అధికార బాధ్యతలు మరిచి సివిల్ పంచాయతీలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

 Ap, Police Officer, Suspension-TeluguStop.com

ప్రజలకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా సస్పెండ్ చేయడం లేదా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.

విధి నిర్వహణలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసిన ఘటన వేటపాలెంలో చోటు చేసుకుంది.

వేటపాలెం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అజయ్ బాబును గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే గత కొద్దిరోజుల కిందట వేటపాలెంలో దొంతు వెంకటేశ్వరరెడ్డి హత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

కేసు విచారణలో అజయ్ బాబు తీరులో మార్పు రావడం జరిగింది.విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.దీంతో విచారణ చేపట్టిన గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు అజయ్ కుమార్ పై ఆరోపణలు రుజువయ్యాయి.దీంతో అజయ్ ను సస్పెండ్ చేశారు.

కాగా, గతంలో సివిల్ పంచాయతీ చేస్తున్నారనే ఆరోపణలపై ఒంగోలు తాలుకా స్టేషన్ సీఐను సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube