సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రోమాంటిక్ "యువర్ మై హీరో" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌, సనా ఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ, అనంత్ నటీనటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ యాక్షన్ రోమాంటిక్ చిత్రం "యువర్ మై హీరో " వైజాగ్ పరిధిలోని నర్సీ పట్నం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా నర్సీపట్నం కౌన్సిలర్స్ మాతిరెడ్డి బుల్లిదొర, వర్రి శ్రీనివాస్, ప్రెసిడెంట్ దేవుడు వీరి చేతుల మీదుగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నర్సీ పట్నం కౌన్సిలర్స్ మాతిరెడ్డి బుల్లిదొర, వర్రి శ్రీనివాస్, ప్రెసిడెంట్ దేవుడు లు మాట్లాడుతూ .

సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ మాంటిక్ వంటి "యువర్ మై హీరో" చిత్రం మా పరిసర ప్రాంతాల్లో షూట్ చేసి మా చేత ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయించడం చాలా సంతోషంగా ఉంది.త్వరలో ఈ చిత్రం విడుదలై గొప్ప విజయం సాధించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ.మా "యువర్ మై హీరో " చిత్రాన్ని గోవాలో మండ్రమ్, సోలిమ్, అంబోలి వంటి అందమైన లొకేషన్స్ లలో మరియు హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఇలా అనేక ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేయ్యడం జరిగింది.

Suspense Thriller Action Romantic You Are My Hero Movie First Look Poster Releas

ఇందులో ఉన్న మూడు పాటలు మూడు ఫైట్లు ఈ సినిమాకు చక్కగా కుదిరాయి.భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది.హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాము.

Advertisement
Suspense Thriller Action Romantic You Are My Hero Movie First Look Poster Releas

ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా తీసిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం.ప్రేక్షకు లందరూ మా "యువర్ మై హీరో " చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

Suspense Thriller Action Romantic You Are My Hero Movie First Look Poster Releas

చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ.ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న సినిమా.ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు.

ఇక్కడున్న పెద్ద మాఫియాను అంతం చేసే క్రమంలో హీరో, హీరోయిన్లు చంపబడతారు.ఇక్కడి నుండే అసలు కథ ప్రారంభమవుతుంది.

చనిపోయిన తరువాత వారు గోస్ట్ గా మారి తమను చంపిన వారిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనే ఆసక్తికరమైన కథాంశంపై ఈ సినిమా నడుస్తుంది.చక్కటి కథతో తీస్తున్న ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాము.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ యాక్షన్ & రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి నిర్మాతల సహకారం వల్లే ఈ చిత్రం ఇంతబాగా వచ్చింది.ప్రతి ఒక్క ఆడియన్స్ కు మా "యువర్ మై హీరో" చిత్రం తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

Advertisement

నటీనటులు

ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌,సంహిత విన్య, ఐశ్వర్య,మిలింద్ గునాజీ,మేకా రామకృష్ణ,అనంత్ తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాత: మిన్ని, లైన్ ప్రొడ్యూసర్: టీనా మార్టిన్ సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: షేర్ సహాయ దర్శకుడు: నాగు, భవాని, లోవ రాజు, వెంకీ, సుదర్శన్, సహ దర్శకుడు: రామ్ బాబు, పురం కృష్ణ, అబిద్ అసోసియేట్ డైరెక్టర్: బాలాజీ, డి వెంకట ప్రభు, బొండ్ల రవితేజ.సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి, ఎడిటర్: డి వెంకట ప్రభు, d.i: బాలాజీ, కొరియోగ్రఫీ: సాయి రాజ్, గీత రచయిత: బాష్య శ్రీ, పోరాటాలు: మల్లేష్, vfx :రవి, ప్రవీణ్ కొమరి, ప్రొడక్షన్ మేనేజర్: అప్పారావు, స్టిల్స్: శ్రీనివాస్ కళా దర్శకుడు: ముత్తు పి.ఆర్.ఓ.: ఆర్.కె.చౌదరి.

తాజా వార్తలు