ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై కొనసాగుతున్న సస్పెన్స్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్ కొనసాగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవాళ కవిత నుంచి వివరాలు తీసుకుంటామని గతంలో సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు.అయితే సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఈరోజు అందుబాటులో ఉండటం లేదని చెబుతూ కవిత అధికారులకు లేఖ రాశారు.

ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు.అయితే కవిత రాసిన లేఖపై సీబీఐ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలో కవిత అడిగిన తేదీల్లో అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు