సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణపై సస్పెన్స్ కొనసాగుతుంది.డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
బ్యాంక్ అకౌంట్ తో సహా పూర్తి డాక్యుమెంట్లు తీసుకురావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.అయితే ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులోని మనీలాండరింగ్ పై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పలువురు సినీ ప్రముఖులను ప్రశించిన సంగతి తెలిసిందే.