సర్వేల మతలబ్.. ఊహించడం కష్టమే !

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఏ పార్టీ సత్తా చాటబోతుంది.ఏ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు.

అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు ప్రజానాడీని అంచనా వేసే ప్రయత్నం చేశాయి.

అయితే ఆయా సర్వే ఫలితాలు కూడా ఏ పార్టీకి స్పస్తమైన అధికారాన్ని కట్టబెట్టడం లేదు.దీంతో ఈసారి గెలుపును అంచనా వేయడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

ఈ నెల 1 న టైమ్స్ నౌ నవభారత్ సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలలో వైసీపీ( YCP ) 24 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని, టీడీపీ ఒక్క సీటు కె పరిమితం అవుతుందని, జనసేన పార్టీ( Jana sena ) ఆశాలు ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేసింది.అటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ 9-11 స్థానాలు, కాంగ్రెస్ 2-3 స్థానాలు, బిజెపి 3-5 స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఆ సర్వే వెల్లడించింది.ఇక తాజాగా 28 న ఇండియా టీవి సిఎనేక్స్ నిర్వహించిన సర్వేలో కాస్త బిన్న ఫలితాలు కనిపించాయి.

ఏపీలో వైసీపీ 18 సీట్లు, టీడీపీ 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించగా, తెలంగాణలో బిజెపి 6 స్థానాలు( BJP party ), బి‌ఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 2 లోక్ సభ స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.దీంతో సర్వేలు కూడా ప్రజానాడీని అంచనా వేయడంలో తడబడుతున్నాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.కాగా ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఈసారి ఎన్నికలు మాత్రం అన్నీ పార్టీలకు కీలకం అనే చెప్పాలి.

ప్రజలు కూడా ఈసారి పార్టీలకు మిశ్రమంగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.దాంతో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందో ఊహించడం కష్టమే అని విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు.

మరి తెలుగు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు