తమిళ్ హీరోల్లో చాలా మందికి ఇక్కడ కూడా మార్కెట్ ఉంది.అక్కడి స్టార్ హీరోలు డబ్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తే వాటిల్లో ఇప్పటి వరకు చాలా సినిమాలు మంచి కలెక్షన్స్ సైతం రాబట్టాయి.
మరి అలాంటి హీరోల్లో సూర్య ఒకరు.కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందు తున్న సూర్యకు తెలుగులో మరే తమిళ్ హీరోకు లేనంత ఫాలోయింగ్ ఉంది.
ముఖ్యంగా సూర్య అంటే అమ్మాయిలకు బాగా క్రష్.ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇదిలా ఉండగా ప్రెజెంట్ సూర్య తన 42వ సినిమా చేస్తున్నాడు.డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.
సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది.ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలకు మించి ఈ సినిమా వేరే లెవల్లో ఉంటుందట.అంతేకాదు ఈ సినిమా భారీగా ఎవ్వరు ఊహించని లెవల్లో ఉంటుందట.
ఇటీవల వచ్చిన పలు బిగ్గెస్ట్ సినిమాల్లో సూర్య 42వ సినిమా కూడా నిలవబోతుంది అని టాక్.

ఇప్పటికే మోషన్ పోస్టర్ తో మేకర్స్ ఈ సినిమాపై భారీ హైప్ అయితే క్రియేట్ చేసారు.మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని అంచనాలను క్రియేట్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







