ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటా....

తెలుగులో అక్క, అమ్మ, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి "సురేఖ వాణి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి సురేఖ వాణి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే ప్రయత్నించింది.

ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించే అవకాశాలు రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.దీంతో దాదాపుగా 200 కు పైగా చిత్రాల్లో నటించి సురేఖ వాణి బాగానే ఆకట్టుకుంది.

కాగా నటి సురేఖ వాణి తెలుగు బుల్లితెరలో పలు ధారావాహికలకు మరియు వెబ్ సిరీస్ లకు రైటర్ గా పని చేసిన ప్రముఖ డైరెక్టర్ సురేష్ తేజ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కాగా గత ఏడాది నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు.

దీంతో అప్పటి నుంచి నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసం ఉంటుంది.తాజాగా తన భర్త సురేష్ తేజ పుట్టిన రోజు కావడంతో సురేఖ వాణి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన భర్త ఫోటోని షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

Character Artist Surekha Vani Get Emotional To Remembering Her Husband Suresh Te
Advertisement
Character Artist Surekha Vani Get Emotional To Remembering Her Husband Suresh Te

అంతేకాకుండా తనను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొంది.అయితే సురేష్ తేజ మరణించిన అనంతరం సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో పలు కథనాలు బలంగా వినిపించాయి.కానీ సురేఖ వాణి మాత్రం తన రెండో పెళ్లి విషయంపై స్పందిస్తూ తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సురేఖ వాణి తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

Character Artist Surekha Vani Get Emotional To Remembering Her Husband Suresh Te

అలాగే సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలతో బాగానే ఆకట్టుకుంటోంది.కాగా ఆ మధ్య సుప్రీత కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుందని పలు కథనాలు వినిపించినప్పటికీ సురేఖ వాణి మాత్రం తన కూతురిని హీరోయిన్ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో క్లారిటీ ఇచ్చింది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు