బిల్కిన్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.విచారణలో భాగంగా గుజరాత్ ప్రభుత్వ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో నిందితులైన పదకొండు మంది ఖైదీలకు రిమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ధర్మాసనం ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసింది.
అలాగే ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.







