ఏపీలో అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.తమ సమస్యలపై గత పదకొండు రోజులుగా అంగన్వాడీలు నిరసన చేస్తున్నారని తెలిపారు.
అంగన్వాడీల నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు.2014 సంవత్సరంలో అంగన్వాడీలకు అందించే వేతనం రూ.6,300 పెంచి రూ.10,500 చేశామన్నారు.ఎలాంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదని విమర్శించారు.
అనంతరం ప్రవాసాంధ్రుడు యశస్వి అరెస్ట్ పై స్పందించిన చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని అరెస్ట్ చేశారన్నారు.అరెస్టులపై ఉన్న శ్రద్ధ అంగన్వాడీల సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే అరెస్టులపై కాదు, అంగన్వాడీల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.







