బీజేపీ లోకి రజనీకాంత్ ? నేడు అమిత్ షాతో భేటీ ?

ఒక్కో రాష్ట్రంలో పట్టు పెంచుకునే దిశగా కేంద్ర అధికార పార్టీ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణ, ఆంధ్ర తో పాటు, తమిళనాడులోనూ పాగా వేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగానే తమిళనాడులో స్టార్ ఇమేజ్ ఉన్న నాయకులందరినీ బిజెపిలో చేర్చుకునే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ బిజెపిలో చేరాలి అనే ఆలోచనలో ఉన్నారట.

దీంతో రాజకీయంగా ఆయన కు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయన ఎప్పటి నుంచో సొంత పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే ఆయన బిజెపిలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది.అయితే తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి , బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, చేదు ఫలితాలు ఎదురవడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు కొనసాగిస్తూనే కొత్త పార్టీలను కలుపుకుని వెళ్లి బీజేపీని బలోపేతం చేయాలనే విషయంపై దృష్టి సారించాయి.ఈ నేపథ్యంలోనే రజనీకి గేలం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.అలాగే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కూడా బీజేపీలో చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చెన్నై లో రెండు రోజులపాటు పర్యటిస్తున్న అమిత్ షా ను ఈమేరకు రజనీకాంత్ అలగిరి కలుస్తారని, ఈ సందర్భంగా పార్టీలో చేరిక పై ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.పార్టీలో చేరిన వెంటనే రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఆయనే అని ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తగ్గట్టుగానే గత కొంతకాలంగా రజినీకాంత్ బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండడం,  సర్జికల్ స్ట్రైక్, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి వంటి విషయాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఆయన సమర్థిస్తూ వస్తుండడం ఇవన్నీ దానిలో భాగంగానే కనిపిస్తున్నాయ్ అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే రజిని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసినా,  చేయకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తారు అని,  బహిరంగంగా ప్రకటన చేసినా, తమకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బిజెపి అగ్రనేతల్లో కనిపిస్తోంది.

రజినీకాంత్ బిజెపిలో చేరే విధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి చక్రం తిప్పుతున్న ట్లు సమాచారం.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు