జుట్టు ఊడి ఊడి బట్టతల వస్తుందేమోనని భయపడుతున్నారా.. అయితే మీరిది తెలుసుకోవాల్సిందే!

బట్టతల( Bald ) .పురుషులను కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

చాలా మంది పురుషులు బట్టతల పేరు వింటేనే వణుకుతుంటారు.హెయిర్ అధికంగా రాలిపోతుంది అంటే చాలు ఎక్కడ బట్టతల వస్తుందేమోనని తెగ భయపడుతూ ఉంటారు.

మీ జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుందా.‌.? బట్టతల వస్తుందేమో అని బెంగ పెట్టుకున్నారా.? అయితే మీరు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని తెలుసుకోవాల్సిందే.ఈ రెమెడీని కనుక పాటిస్తే బట్టతలతో భయం అక్కర్లేదు.

మరి లేటెందుకు బట్టతలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఒక అంగుళం అల్లం ముక్క కూడా తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు( Ginger slices, onion slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు పొడి( Fenugreek powder ), వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి మరియు ఉల్లి అల్లం జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి మరోసారి మిక్స్ చేయాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న పురుషులు ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

ఫలితంగా బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.కాబట్టి జుట్టు ఊడి ఊడి బట్టతల వస్తుందేమో అని బెంగ పెట్టుకున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

జుట్టును ఒత్తుగా మార్చుకోండి.

Advertisement

తాజా వార్తలు