యాబైలోనూ యంగ్‌గా క‌నిపించాలా? అయితే ఈ క్రీమ్ ట్రై చేయండి!

వ‌య‌సు పైబ‌డే కొద్ది శరీరంలో శ‌క్తి త‌గ్గ‌డ‌మే కాదు.చ‌ర్మంలో ఎన్నో మార్పులు సంత‌రించుకుంటాయి.

ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు తీవ్రంగా మ‌ద‌న పెడుతుంటాయి.దాంతో వాటిని క‌వ‌ర్ చేసుకుందుకు ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటాయి.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను యూజ్ చేస్తే.యాబైలోనూ యంగ్‌గా మెరిసిపోవ‌చ్చు.

మరి ఇంకెందుకు ఆల‌స్యం ఆ క్రీమ్ ఏంటీ ఎలా త‌యారు చేసుకోవాలి.వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక ఆరెంజ్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క తీయ‌కుండానే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే క‌ట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించిన ప‌దార్థాల‌ను చ‌ల్లార‌బెట్టుకుని.

మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌ను ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని.

ఒక బౌల్‌లోకి వేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ కొకొన‌ట్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఒక బాక్స్‌లో ఈ క్రీమ్‌ను నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు నైట్ నిద్ర‌పోయే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని ప‌డుకోవాలి.ఇలా చేస్తే చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు తొల‌గిపోయి ముఖం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

Advertisement

మ‌రియు సాగిన చ‌ర్మం టైట్‌గా కూడా అవుతుంది.