బాడీని డిటాక్స్ చేసి బరువును త‌గ్గించే సూప‌ర్ జ్యూస్ మీకోసం!

ఇటీవ‌ల కాలంలో అధిక బ‌రువు అనేది వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రినో ప‌ట్టిపీడిస్తోంది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒత్తిడి, ఒకేచోట‌ గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల శ‌రీర బ‌రువు పెరిగిపోతూ ఉంటుంది.

దాంతో పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ జ్యూస్‌ను తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక క్యారెట్‌, ఒక కీర దోస‌లను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక పియ‌ర్ పండును కూడా తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, కీర దోస ముక్క‌లు, పియ‌ర్ పండు ముక్క‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్‌, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

అంతే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్-కీర-పియ‌ర్‌ జ్యూస్ సిద్ధ‌మైన‌ట్లే.ఈ జ్యూస్ ను ప్ర‌తి రోజు ఉద‌యాన్నే తీసుకోవాలి.త‌ద్వారా అందులో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను తొల‌గించి బాడీని డిటాక్స్ చేస్తాయి.

అలాగే అధిక కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి.అతి ఆక‌లి స‌మ‌స్య‌ను సైతం దూరం చేస్తాయి.కాబ‌ట్టి, ఎవరైతే బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారో.

వారు త‌ప్ప‌కుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు