వ్యాయామాల‌ త‌ర్వాత ఈ డ్రింక్స్ తాగితే సూప‌ర్ బెనిఫిట్స్‌!

ఆరోగ్యంగా, ఫిట్‌గా మ‌రియు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాలంటే వ్యాయామాలు త‌ప్ప‌నిస‌రి.వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల లైఫ్ స్పాన్ కూడా పెరుగుతంది.

అందుకే ఆరోగ్య నిపుణులు ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయ‌మ‌ని సూచిస్తుంటారు.హెల్త్ అండ్ ఫిట్నెస్‌కు ప్రాధాన్యత‌ ఇచ్చే వారు ఖ‌చ్చితంగా వ‌ర్క‌వుట్స్‌ను త‌మ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటారు.

అయితే వ్యాయామాలు చేసిన త‌ర్వాత చాలా మంది టీ, కాఫీ, ప్రోటీన్ షేక్స్ వంటివి తీసుకుంటారు.కొంద‌రు న‌ట్స్, అర‌టి పండు, యాపిల్ వంటివి తింటుంటారు.

కానీ, ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ్యాయామాల అనంత‌రం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్‌ను తాగితే సూప‌ర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్స్ ఏంటో.

Advertisement
Super Benefits Of Drinking These Drinks After Exercise Details! Drinks, Exercise

వాటి వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయో.తెలుసుకుందాం ప‌దండీ.

పుచ్చ‌కాయ జ్యూస్‌. ఈ వేస‌వి కాలంలో వ్యాయామాల అనంత‌రం తీసుకోద‌గ్గ బెస్ట్ డ్రింక్‌గా చెప్పుకోవ‌చ్చు.

వ‌ర్క‌వుట్స్ పూర్తైన త‌ర్వాత ఒక గ్లాస్‌ పుచ్చ‌కాయ జ్యూస్ తాగితే నీర‌సం, అల‌స‌ట తొల‌గిపోతాయి.బాడీ హైడ్రేటెడ్‌గా మారుతుంది.

శ‌రీరం కోల్పోయిన శ‌క్తి మొత్తం ల‌భిస్తుంది.

Super Benefits Of Drinking These Drinks After Exercise Details Drinks, Exercise
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఆరెంజ్ జ్యూస్‌. టేస్ట్‌గా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా వ్యాయామాల త‌ర్వాత ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్‌ను సేవిస్తే బాడీ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

Advertisement

శ‌రీరంలో ఉండే అధిక వేడి తొల‌గిపోతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

మ‌రియు గుండె ఆరోగ్యం పైతం ఇంప్రూవ్ అవుతుంది.ఇక ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ్యాయామాల అనంత‌రం లెమ‌న్ జ్యూస్ ను కూడా తీసుకోవ‌చ్చు.

లెమ‌న్ జ్యూస్‌లో ఉండే ప‌లు ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు వేస‌వి వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.బ‌రువు వేగంగా త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

శ‌రీరం డీహైడ్రేట్‌ అవ్వ‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

తాజా వార్తలు