Suma : ఆ హీరో హిట్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. ఏ సినిమా అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.

ఈమె ఎంతో అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే నిజానికి ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తన తల్లిదండ్రుల ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లో స్థిర పడటంతో తెలుగు కూడా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

తరచూ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను నవ్విస్తూ ఉంటారు.

Suma Gives Review About Pruthvi Raj Sukumaaran Aadu Jeevitham Movie

ఇక సుమ ఏదైనా కొత్త సినిమాలను చూస్తే కనుక తప్పకుండా ఆ సినిమాలకు ఈమె రివ్యూ ఇస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఒక హీరో సినిమా చూసి ఈమె కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ సినిమాకు రివ్యూ ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరస్ గా మారింది.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌( Pruthvi Raj Sukumaran ) నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఆడు జీవితం( Aadu Jeevitham )(ది గోట్‌ లైఫ్‌) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
Suma Gives Review About Pruthvi Raj Sukumaaran Aadu Jeevitham Movie-Suma : ఆ

ఈ సినిమాను సుమ తాజాగా చూడటమే కాకుండా ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.

Suma Gives Review About Pruthvi Raj Sukumaaran Aadu Jeevitham Movie

నజీబ్‌ కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా చాటి చెప్పారు.ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీకి( Director Blessy ) నా సెల్యూట్‌.పృథ్వీరాజ్‌.

ఈ సినిమాలో బక్క చిక్కిపోయి పక్కటేముకలు కనిపించే సన్నివేశాలలో చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి, సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, నిబద్ధతకు ఇది నిదర్శనం అంటూ ఈ సినిమా పట్ల ఈమె రివ్యూ ఇస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇక టిల్లు స్క్వేర్( Tillu Square ) సినిమా గురించి కూడా స్పందిస్తూ.

ఈ సినిమా అయితే ఆద్యంతం నవ్వులు పూయించిందని చెబుతూ టిల్లు స్క్వేర్ టీమ్‌ను మెచ్చుకున్నారు.ప్రస్తుతం సుమ చేసిన ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు