భర్త సుకుమార్ గురించి భార్య కామెంట్స్ వైరల్.. నా ప్రాణం, సర్వం అంటూ?

లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈయన సినిమా విషయంలో తీసుకునే శ్రద్ధ, ఆ సినిమాపై తన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.

నిత్యం తన పనిపై శ్రద్ధ చూపే సుకుమార్ పెద్దగా ఎలాంటి విషయాలకు ఎమోషనల్ కారు.కానీ పుష్ప సినిమా విషయంలో సుకుమార్ కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

డిసెంబర్ 17వ తేదీన  వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.ఈ క్రమంలోనే చిత్రబృందం థాంక్యూ మీట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ వేదికపై మాట్లాడుతూ మొదటగా తన భార్య తబితకు థాంక్స్ చెబుతూ థ్యాంక్యూ మీట్ కార్యక్రమం ప్రారంభించారు.సాధారణంగా సక్సెస్ మీట్ అయినా ఏ కార్యక్రమమైనా చిత్రబృందం సినిమా గురించి మాట్లాడతారు కానీ సుకుమార్ మాత్రం ఈ సినిమా థ్యాంక్యూ మీట్ లో ముందుగా తన భార్య గురించి మాట్లాడారు.

Advertisement
Sukumar Wife Comments About Her Husband And Its Goes Viral, Sukumar, Wife, Comme

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను భరిస్తున్నందుకు తబితకు థాంక్స్ నా భార్యగా ఈ విషయంలో తనకి కూడా భాగం ఉందని సుకుమార్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా సుకుమార్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడంతో తన భార్య తబిత సుకుమార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే తనకు తన భర్త పై ఎంత ప్రేమ ఉందో తెలిసేలా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

నా పేరుతోనే థాంక్యూ మీట్ ప్రారంభించిన నా భర్త, నా సామి సుకుమార్ కు ఒక మాటతో మొదలు పెడతా.నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవం నువ్వు.

నీలాంటి మనిషి కి భార్యగా రావడం నిజంగా నా అదృష్టం.ఇలాంటి అదృష్టం తనకు కలిగినందుకు ముందుగా ఆ భగవంతుడికి తనే థాంక్స్ చెప్పాలని తెలియజేశారు.

Sukumar Wife Comments About Her Husband And Its Goes Viral, Sukumar, Wife, Comme
న్యూస్ రౌండప్ టాప్ 20

నిజం చెప్పాలంటే నాకు కొన్ని కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే నీ కలలే నా కలలుగా మార్చుకున్నాను.ఒక విధంగా చెప్పాలంటే ఇలా నీ కలలను తన కలలగా భావించడం కూడా ఒక వరమే ఎందుకంటే నీ లాగా పెద్ద పెద్ద కలలు కనడం కూడా నాకు రాదు నీతో జీవితం పంచుకున్నందుకు నన్ను అలాంటి గొప్ప స్థానంలో నిలబెట్టినందుకు నీకు పాదాభి వందనములు ఇట్లు నీ ప్రాణం అంటూ భార్య తబిత ఎమోషనల్ కామెంట్ చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

" autoplay>

తాజా వార్తలు