విరూపాక్ష చిత్రంతో సుకుమార్‌ పెట్టింది ఎంత? వచ్చింది ఎంత?

ఈ మధ్య కాలంలో సుకుమార్ ( Sukumar )పేరు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన శిష్యులు చేసే ఏ సినిమాకైనా సుకుమార్ సమర్పకుడిగా లేదా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అందుకోసం ఆయన పెడుతున్న ఖర్చు పెద్దగా ఏమీ లేదు.కానీ లాభాల్లో మాత్రం కొంత వాటా ను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.

తాజాగా సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమాతో సుకుమార్ కి భారీగానే దక్కుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా యొక్క దర్శకుడు కార్తీక్ వర్మ దండు గతం లో సుకుమార్ వద్ద పలు సినిమాలకు వర్క్ చేశాడు.

ఈ మధ్య కాలం లో సుకుమార్ కి ఈ కథ వినిపించడం తో నచ్చి మెగా హీరో తో చేసే అవకాశాన్ని కుదిరిచినట్లుగా తెలుస్తుంది.అలా ఈ సినిమా నిర్మాణం లో సుకుమార్ భాగస్వామ్యం అయ్యాడట, అంతే కాని సుకుమార్‌ పెద్దగా ఖర్చు చేసింది ఏమీ లేదు.

Advertisement
Sukumar Profits For Sai Dharam Tej Movie Virupaksha , Sai Dharam Tej , Sukumar ,

తన సమయాన్ని కూడా కేటాయించింది లేదట.

Sukumar Profits For Sai Dharam Tej Movie Virupaksha , Sai Dharam Tej , Sukumar ,

సినిమాకు సంబంధించి చిన్న చిన్న సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడట.అందుకోసం విరూపాక్ష సినిమా కు దాదాపుగా 5 కోట్ల రూపాయల లాభాన్ని సుకుమార్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.రూపాయి పెట్టుబడి పెట్టకుండా తన పేరు ను బ్రాండ్ గా ఉపయోగిస్తూ సుకుమార్ సంపాదిస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Sukumar Profits For Sai Dharam Tej Movie Virupaksha , Sai Dharam Tej , Sukumar ,

ఇక ఆయన దర్శకత్వంలో సినిమాల విషయానికొస్తే పుష్ప సూపర్ హిట్ అవ్వడం తో మళ్లీ పుష్ప ను రూపొందించే పనిలో ఉన్నాడు.అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత సుకుమార్.విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

దర్శకుడిగా సినిమాలు భారీ బడ్జెట్‌ తో చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా వరుసగా సినిమాలను చేస్తున్నాడు సుకుమార్.

Advertisement

తాజా వార్తలు