తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు.ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో ఆరోపణలు ఉపసంహరించుకోవాలని కవిత, కేటీఆర్ బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లు, ఆధారాలు, వాట్సాప్ చాట్ కాపీలు, స్క్రీన్ షాట్ లు , ఫేస్ టైమ్ కాల్ కాపీలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.తన వద్ద ఉన్న ఆధారాలు ఇస్తే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో భూమి, రూ.100 కోట్లతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇస్తామని చెప్పారని తెలిపారు.కేటీఆర్ సన్నిహితుడి ద్వారా తన కుటుంబాన్ని బెదిరించారన్నారు.ఈ నేపథ్యంలో బెదిరింపులను ఇన్వెస్టింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.తన ఫిర్యాదుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుఖేశ్ గవర్నర్ ను లేఖలో కోరారు.